కులమతాలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలు… రాష్ట్ర మంత్రి
1 min readవినాయక చవితి పూజల్లో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ దర్శించుకున్నాను. ముందుగా రాంబొట్ల దేవాలయం వద్ద కొలువుదీరిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాతబస్టాండులోని కురువ వీధిలో ఉన్న వినాయక విగ్రహం వద్ద పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ వరదల నుండి ప్రజలను రక్షించాలని వినాయకుడిని వేడుకున్నట్లు చెప్పారు. కుల,మత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసి వినాయక చవితి పండుగను జరుపుకోవడం కర్నూలు ప్రత్యేకత అన్నారు. హైదరాబాద్ తర్వాత కర్నూల్లోనే వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని చెప్పారు.