PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్..

1 min read

హత్యకు ఉపయోగించిన రెండు నాటు తుపాకీలు గొడ్డలి

ఐదుగురు నిందితుల అరెస్ట్..పరారీలో ఒకరు

రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందిని అభినందించిన డీఎస్పీ రామాంజి నాయక్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.మహిళ హత్య కేసు వివరాలను ఆదివారం సాయంత్రం నందికొట్కూరు సర్కిల్ కార్యాలయంలో ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ పాత్రికేయుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ గురువారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మారుతినగర్ లో నివసిస్తున్న పింజరి శాలిభీ (41)హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు గల కారణాలు పరిశీలిస్తే ఈ కేసులో మొదటి నిందితుడైన వడ్డే లక్ష్మీ నరసింహ ఈయన తండ్రి గజేంద్ర ను 2015 లో మృతురాలు శాలిభీ మరియు ఈమె స్నేహితురాలు రేష్మ ఇద్దరు కలిసి గజేంద్రను తలపై బండ రాయితో మోదీ చంపారు.ఆ కేసులో ఆమె ఏ-1 ముద్దాయి తన తండ్రిని చంపారనే ఉద్దేశంతో నరసింహ తన స్నేహితులతో మద్యం సేవించేటప్పుడు చెబుతూ ఉండేవాడు.శాలిభీ ని చంపాలని స్నేహితులతో పథకం ప్రకారం మారుతి నగర్ లో శాలిభీ ఇంటికి వెళ్లి గేటు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న ఆమెను గొడ్డలితో మరియు నాటు తుపాకీలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు.ఈమె కుమారుడు మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేశాం ఒకరు పరారీలో ఉన్నారని ఇతని కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశామన్నారు.లక్ష్మీ నరసింహ(చందు),సగినేల వెంకటరమణ,మనోజ్ కుమార్(బీహార్),పాలమర్రి స్వాములు,సిసిఎల్(బాల నేరస్థుడు),అన్నయ్య  వెంకటేశ్వర్లు అను వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.ఈ కేసును చాక చక్యంగా వ్యవహరించి చేదించిన రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం ను ఎస్సైలు సురేష్ కుమార్,తిరుపాలు, లక్ష్మీనారాయణ,ఓబులేష్ మరియు సిబ్బంది చెన్నయ్య,పరశురాం, హోంగార్డు గోపాల్ ను డిఎస్పీ అభినందించారు.చెన్నయ్య,పరశురాం,గోపాల్ లకు డీఎస్పీ రివార్డు అందజేశారు.

About Author