విజయవాడ వరదబాధితులకు ఆలూరు తాలూకా నుండి భారీసహాయం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి.వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలోముఖ్యమంత్రి వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరదబాధితుల సహాయార్థం సుమారు 1500కిట్లు ఆలూరు తాలూకా నుండి కర్నూలు జిల్లా అధ్యక్షులు P.తిక్కారెడ్డి సమక్షంలో విజయవాడకు పంపటానికి రెడీగా ఉన్నాయని వీరభద్ర గౌడ్ అన్నారు.ఈసందర్భంగా ఆలూరు టిడిపి ఆఫీసులో మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ టిడిపి నాయకులు,కార్యకర్తల సహాయంతోనే ఇంతపెద్ద స్థాయిలో ఫ్లడ్ బాధితులకు కిట్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.కావున ఈకార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి గౌ.శ్రీ.వీరభద్ర గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలూరు పట్టణ టిడిపి నాయకులతో పాటు మండల ఆయాగ్రామాల టిడిపి నాయకులు మరియు తాలూకా టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు, వివిధ హోదాలలో ఉన్న టిడిపి, జనసేన బిజెపి నాయకులు తెలుగు యువత, Itdp,Tnsf,Tntuc మరియు నందమూరి,నారా, బివిజి అభిమానులు కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.