PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో ను జయప్రదం చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణకై అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త రాస్తరోకో”నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు, ఏపీ రైతు సంఘాల నాయకులు ఎన్ కృష్ణయ్య, ఎం రంగన్న, జి నెట్టే కంటయ్య, ఉమాపతి ,పెద్ద వీరన్న, ఏం కారన్న, కే తిమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక చదువులు రామయ్య భవన్లో వారు మాట్లాడుతూ,వైజాగ్ స్టీల్ (Vizag Steel) గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం , భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు ఇది. విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారని తెలిపారు. కర్మాగారం ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవని, సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నాయని అన్నారు.2010 నవంబర్ 10న విశాఖ స్టీల్ సంస్థ నవరత్న హోదా పొందిందని తెలిపారు.కర్మగారం విస్తరించి ఉన్న ప్రాంతం భారతదేశం ఆసియా మైనర్ లలో అతిపెద్దదని పేర్కొన్నారు. ఇలాంటి ఉక్కు కర్మాగారంను కేంద్రంలో ముడవసారి అధికారంలోకి వచ్చిన బి జె పి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే కుట్ర శర వేగంగా సాగుతుందని తెలిపారు.నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కేంద్ర స్టీల్  మంత్రి కుమార్ స్వామి ,సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ ను సందర్శించి, విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్      అని కొనియాడారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి 45 రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, మోడీ ని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ఈ ప్రకటన చేసి నేటికీ ముడుమాసాలైనా  కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నడపడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.విశాఖ ఉక్క పరిరక్షణకై అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 10న రాస్తారోకో చేయాలని విజయవాడ ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న జరిగిన సమావేశంలో  చర్చించి రాస్తారోకో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.

About Author