ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు : వినాయక చవితి పండగ నాడు ప్రతిష్టాపన జరిగి, రెండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను వెలుగోడు మండలంలో మూడో రోజు సోమవారం నిమజ్జనానికి తరలించారు. వెలుగోడు మొత్తం 76 విగ్రహాలు కాగా పట్టణంలో 39 విగ్రహాలను వివిధ కూడళ్ల లో ప్రతిష్టించారు. నిమజ్జనానికి గణనాథుడు ని వాహనంపై ఎక్కించి డ్రమ్స్ వాయిద్యాలతో, యువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపుగా ముందుకు కదిలారు. మహిళలు కూడా ఉత్సాహంగా రంగులు చల్లుకొని నృత్యాలు చేశారు.జై గణేష్, ఘనపతి పప్పా ఓరియా అంటూ నినాదాలు చేస్తూయువకులు కేరింతలతో నిమజ్జనం లో పాల్గొన్నారు. ప్రజలకు విగ్రహ కమిటీ నిర్వాహకులు ప్రసాదాలను పంపిణీ చేశారు. నిమజ్జనం ఊరేగింపు గండిపేట, సిపినగరు, ద్వారకా నగర్, పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు చేరుకున్న తర్వాత గ్రామములోని మిగతా గణనాథులు ఊరేగింపుగా వచ్చి కలుసుకున్నాయి. అక్కడినుండి గాంధీనగర్, పాత బస్టాండు, గ్రామపంచాయతీ, రెడ్డి వీధి ,జమ్మి నగర్ మీదుగా ఊరేగింపు నిర్వహించి గాలేరు లో నిమజ్జనం చేసారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై విష్ణు నారాయణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.