వినాయకుని లడ్డును దక్కించుకున్న శ్రీరాములు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుని నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా పీరు సాహెబ్ పేట గ్రామంలో జరిగిన వినాయకుని లడ్డు వేలం పాటలో దండగుల రామకృష్ణ కుమారుడు దండుగుల శ్రీరాములు. లడ్డును16,300 రూపాయలకు దక్కించుకున్నారు. గ్రామంలోని ఇతరులు కూడా లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు కానీ చివరకు శ్రీరాములు అధికంగా లడ్డును పలకడంతో వినాయకుని లడ్డు ఆయనకే దక్కింది.అదే విధంగా పల్లపు ఉశేనయ్య కుమారుడు పల్లపు శివ వినాయకుని కలశం 5,200 రూపాయలకు దక్కించుకున్నారు.ఈ వేళ పాటలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు.అన్నమయ్య లడ్డును వినాయక కలశమును గ్రామ నాయకులు ఈ. రామేశ్వర్ రెడ్డి,దేవమాడ జయరాముడు,దేరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,ఎం మహేశ్వర్ రెడ్డి,మహానంది మాహేశ్వర్ రెడ్డి,కాట్రేడ్డి జగదీశ్వర్ రెడ్డి,ఈ మురళీధర్ రెడ్డి,ఎర్రమల పుల్లారెడ్డి,జి నాగేశ్వర రెడ్డి, ఆర్ భద్రారెడ్డి,వినాయక చవితి కమిటీ సభ్యులు మరియు మహిళలు ప్రజలు చిన్నారులు సోమవారం ప్రత్యేకంగా ఆ పూజలు నిర్వహించారు. కాకుండా ఈ గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.