అనాధకు అంత్యక్రియలు..పంచాయితీ కార్యదర్శికి హాట్సాఫ్
1 min readపీఎస్ సొంత ఖర్చుతో అంత్యక్రియలు
వినయ్ చంద్రకు హ్యాట్సాఫ్ అంటున్న ప్రజలు..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): బతికి ఉన్నప్పుడు కుమారులు కానీ కూతుర్లు కానీ తల్లిదండ్రులను పట్టించుకోరు వారి వృద్ధాప్యం అయిన తర్వాత వారిని సంతోష పెట్టాల్సిన వారు కరువు అవుతున్నారు నేటి సమాజంలోని ఓ గ్రామంలో ఓ వృద్ధురాలికి ఎవ్వరూ లేరు అదే గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఆ వృద్ధ అనాధరాలకి ఆయనే ప్రభుత్వపరంగా వచ్చే వాటిని ఆయన సొంత ఖర్చులతో చేయిస్తూ ఇతరులకు అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ ఆదర్శంగా అటు ప్రజలకు ఆదర్శంగా ఉంటూ ప్రజల దీవెనలు అందుకుంటున్నారు ఆ పంచాయతీ కార్యదర్శి ఎవరంటే..నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని చింతలపల్లె గ్రామ పంచాయితీ కార్యదర్శి వేల్పుల వినయ్ చంద్ర.ఈ పంచాయతీకి మజార గ్రామం అయిన కాజీపేట గ్రామంలో బోయ సంజమ్మ(65)అనే వృద్ధురాలు చాలా సంవత్సరాల నుండి అదే గ్రామంలో నివసిస్తూ ఉంది.కానీ ఆమెకు ఉండడానికి గూడు లేదు కుటుంబ సభ్యులు గానీ ఎవరూ లేరు.ఈమెకు కనీసం ఆధార్ కూడా లేదు 2020 లో పీఎస్ ఆధార్ కార్డు,రేషన్ కార్డు తెప్పించారు ఆ తర్వాత వృద్ధాప్య పించను ఆమెకు ఇప్పించారు.సంజమ్మ గ్రామంలో మరణించింది.ఎవ్వరూ కూడా ఆమె దగ్గరికి రావడం లేదు అంత్యక్రియలు చేద్దామనే తలంపు కూడా రాలేదేమో వారికి..పంచాయతీ కార్యదర్శి తన మానవత్వాన్ని చాటుకుంటూ గ్రామాల్లో ఏ విధంగా అయితే అంత్యక్రియలు చేస్తారో ఆ విధంగానే ఈమెకు కూడా తన సొంత ఖర్చుతో అంత్యక్రియలు దగ్గరుండి వినయ్ చంద్ర పూర్తి చేయించారు.అనాధకు అంత్యక్రియలు చేయడంతో ప్రజల నుండి దీవెనలు వినయ్ చంద్రకు వెల్లువెత్తుతున్నాయి.