డిప్యూటీ సీఎం లక్ష..పల్లెల్లో మార్పు
1 min read-పల్లెల్లో సర్పంచులు మార్పు తేవాలి
-సీఎం చంద్రబాబు ప్రజా జీవితానికే అంకితం చేశారు
-సర్పంచ్ లకు లక్ష రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జయసూర్య..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నగదుతో వరద బారిన పడిన ప్రతి గ్రామ పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున అలా 4 వందల గ్రామ పంచాయతీలకు ఆయన అందజేయడం హర్షించదగ్గ విషయమని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.సోమవారం మధ్యాహ్నం పాములపాడు మండల పరిషత్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాలు అయినా వేంపెంట,భానుముక్కల గ్రామాల సర్పంచ్ లకు ఎమ్మెల్యే లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన లక్ష రూపాయల నగదుతో సర్పంచులు పల్లెల్లో మార్పులు తీసుకురావాలని అన్నారు.ఈ డబ్బును గ్రామాల్లో శానిటేషన్ మంచినీటికి మాత్రమే వాడాలన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ఉంటూ వడదల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారని ఆయన ప్రజా జీవితానికే అంకితం చేశారని ఎమ్మెల్యే అన్నారు.సీఎం వయస్సును మరియు వరదలను లెక్కచేయకుండా తిరుగుతూ ఉన్నారని అన్నారు.కూటమి ప్రభుత్వంలో మౌలిక వసతులకు మరియు గ్రామాల అభివృద్ధికి త్వరలోనే నిధులు వస్తాయని వాటి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,నంద్యాల జిల్లా టిడిపి అధికార ప్రతినిధి గిరీశ్వర్ రెడ్డి,మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ చింత సురేష్ బాబు, జనసేన నందికొట్కూరు ఇన్చార్జి రవికుమార్,శ్రీరామ థియేటర్ యజమాని రామిరెడ్డి మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు.