బొజ్జ గణపయ్య వెళ్లి రావయ్య.. ఘనంగా నిమజ్జనం కార్యక్రమం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: పల్లెల్లో గ్రామాల్లో వినాయక చవితి సందడి నెలకొంది గత ఐదు రోజుల నుంచి మండపాల్లో కొలువైన గణనాధులు నిమజ్జనానికి తరలి వెళ్లారు .బొజ్జ గణపయ్య వెళ్లి రావయ్య అంటూ భక్తులు ప్రజల కోలాహలం మధ్యన గడివేముల మండల కేంద్రంలో ప్రతిష్టించిన 13 గణనాథులు సాయంత్రం నిమజ్జనానికి తరలివెళ్లాయి. బ్యాండ్ బాజాలతో కోలాటాలు నృత్యాలు చేస్తూ స్వామి వారి ప్రసాదం అందజేస్తూ వినాయక సేవా సమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జనాన్ని వీక్షించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్యవైశ్య సభ్యులు ఏర్పాటు చేసిన లడ్డును స్థానికుడు అమర్నాథ్ రెడ్డి 36వేల రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నాడు నిమజ్జనంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై సీసీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.