ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా ప్రాజెక్టు మేనేజర్
1 min readచెన్నూరు మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం బయనపల్లి గ్రామంలో పకృతి వ్యవసాయం చేస్తున్న పుల్లయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్. ఎస్ వి. ప్రవీణ్ కుమార్. చెన్నూరు మండల వ్యవసాయ అధికారి. కే శ్రీదేవి మంగళవారం సందర్శించారు. రైతులకు పసుపులో పకృతి వ్యవసాయ పద్ధతులను సాగు గురించి రైతులకు వివరించారు. చీడపీడలు తట్టుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వాడే విధానాలను రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది. పసుపు పంటకు ఘన జీవామృతం మరియు ద్రవ జీవామృతం వాడుకను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసే రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారని రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. పకృతి వ్యవసాయం సాగు చేయు విధానం అలాగే జీవామృతం తయారీ విధానాన్ని పకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వర్షాభావం పరిస్థితుల దృశ్య తెగులు సోకే అవకాశం ఉన్నందున జీవామృతం అలాగే పుల్లటి మజ్జిగ వాడే విధానాన్ని రైతులకు సిబ్బంది వివరించారు. పకృతి వ్యవసాయం విధానాలను పాటించి రైతులు తమ ఆరోగ్యమైన పంటలను పండించుకొని ఖర్చు తగ్గించి అధిక లాభాలు పొందవచ్చని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటయ్య వ్యవసాయ సహాయకులు. చరణ్ రెడ్డి. మహమ్మద్ రఫీ రైతులు పాల్గొన్నారు.