ఆత్మహత్యలను.. నివారిద్దాం..
1 min readయువతలో మనోధైర్యం నింపుదాం…
- పరిస్థితులను అధిగమించేలా.. అవగాహన కల్పిద్దాం..
- ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు
- ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై అవగాహన సదస్సు
కర్నూలు, పల్లెవెలుగు: మానసిక స్థితి ధృఢంగా లేకపోవడం…. ఆలోచనలో పురోగతి కనిపించకపోవడం… తదితర కారణాల వల్ల సమాజంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ఆత్మహత్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్‌బాబు. మంగళవారం ప్రపంప ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆత్మహత్యల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. రమేష్ బాబు మాట్లాడుతూ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎస్.పి.మ్యాస్ట్రో మార్గదర్శకత్వంలో స్థాపించబడిన అంతర్జాతీయ ఓమౌజయా యువ చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమన్నారు. సమాజంలో చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన విషయమన్నారు. యువతను ఆత్మహత్యల వైపు దారి తీసే ఆలోచనలు, పరిస్థితులు, వాటిని ఎలా అధిగమించాలి… తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.నాగస్వామి నాయక్ మాట్లాడుతూ విద్యార్థులలో మనోస్థైర్యం నిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వారిని అభినందించారు. ఆ తరువాత వ్యాసరచన పోటీలలో గెలిచిన విద్యార్థులకు మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమం లో ఐఏయూవైఎస్ఏ సంస్థ జిల్లా ప్రతినిధులు హుస్సేన్ బాషా, సభ్యులు బుద్ధి రాజ్, విశ్వనాథ్, సూర్య తేజ, యూసఫ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.