PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల జిల్లా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  ఆంధ్రరత్న భవన్ నందు ఈ రోజు డీసీసీ అధ్యక్షులుగా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి  చేతుల మీదుగా నంద్యాల జిల్లా అధ్యక్షులుగా శ్రీ జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ పదవీ బాధ్యతలు అందుకోవడం జరిగింది.దీనిలో భాగంగా జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ నాకు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి ఇచ్చిన భాధ్యతను తూచా తప్ప కుండా మరింత ప్రజలకు చేరువై,కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తానని,వారికి కానీ పార్టీకి కానీ,ప్రజలకు కానీ ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,అన్ని విధాలా అభివృద్ధికి పాటు పడతానని,ఇప్పుడు పార్టీలో ఉన్నవారిని కలుపుకొని పోతూ, వచ్చేవారికి ఆహ్వానం పలుకుతూ,భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. గతంలో కూడా రెండుసార్లు డీసీసీ అధ్యక్షులుగా సమర్ధవంతంగా పని చేసి మూడవ సారి డీసీసీ పధవి చేపట్టడం చాలా ఆనందంగా ఉంది.2019 లో 2024 లో ఏంపీ గా పోటీ చేసి ఓటు శాతమును భారీగా పెంచుకోవడం జరిగింది.అదేవిధంగా జిల్లాలోని ఏడూ నియోజకవర్గలకు కొత్త ఇన్చార్జులను కేవలం ఏడూ రోజుల కాల పరిమితి వ్యవధిలోనే నియమించడం జరుగుతుంది. అని అదేవిధంగా బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు  కొత్త జిల్లా కమిటీ వేయడం జరుగుతుంది.అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కానీ,సెల్స్ కానీ,కొత్తగా నియమించుకోవడం,జరుగుతుంది.కనుక పార్టీ లోని అందరూ నాయకులు, కార్యకర్తలు అందరితో మరియు పార్టీ అనుబంధ సంస్థలందరితో ఒక సారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ పదవీ బాధ్యతలు ఉండాలో వద్దో అనేది జిల్లా అధ్యక్షుని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలపడం జరిగింది.ఎవరన్నా పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సారి వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రములో ఇటు రాష్ట్రములో 2029 లో కాంగ్రెస్ అదికారములోకి రాబోతుంది.కనుక కష్టపడి పని చేస్తే అధికారం మనదే.అని అన్నారు. ఇప్పటికైనా పార్టీలోకి కష్టపడి పని చేసే వారు రావాలని.కోవర్టులకు స్థానం లేదని కరకంటిగా చెప్పారు. ‎

About Author