వాల్మీకీ/బోయల ఎస్టి సమావేశానికి ఎమ్మెల్యే కి ఆహ్వానం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: 22వ తేదీన కర్నూలు జడ్పి హల్ ల్లో జరగబోయే వాల్మీకీ/బోయల ఎస్టి అంశంపై చర్చా సమావేశానికి హాజరు కావాలని కోరతూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని ఆహ్వానిస్తూ పోస్టర్లను పార్థసారథి చేతుల మీదుగా విడుదల చేపించిన కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్.వాల్మీకీ బోయలను ఎస్టి లో చేర్పించే విషయంపై ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ సమావేశ కార్యక్రమంలో పాల్గొని ఎస్టి సాధనకై తమవంతు సలహా సూచనాలను ఇవ్వాలని మరియు ఎస్టి లో చేర్పించడానికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఆదోనిలో ఆయనను కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకీ యువ నాయకులు ఆదోని సాయి ప్రసాద్, తాయన్న,కల్లుబావి రాజు,ఆదోని వీరేష్, హుళేబీడు వీరేష్ తదితర వాల్మీకీ సహోదరులు పాల్గొన్నారు.