వరద బాధితుల సహాయార్ధం కదం తొక్కిన హోళగుంద
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : విరాళాల సేకరణలో విజయవాడ వరద బాధితుల సహాయ సమైక్య హెుళగుందలో కదం తొక్కింది. ఆరవ రోజు కణం కణం ఏకమై మానవీయ మకుటమై సాగిన విజయవాడ వరద బాధితుల విరాళాల సేకరణ యాత్ర జోరుగా ముందుకు సాగింది. వరద సహాయ సేకరణను తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి మరియు మండల కన్వీనర్ డాక్టర్ తుంబళం తిప్పయ్య ఇరువురు జోడు రథసారథులుగా యువకుల వెన్నంటే ఉండి ముందుకు నడిపించారు. హెుళగుందలోని 9వ వార్డులో చలవాదికాలనీ… మరియు…. దిడ్డి కాలనీ, 4వ వార్డు తదితర ఏరియాలలో నిర్వహించిన వరద బాధితుల సహాయ సేకరణలో 55 బస్తాల బియ్యం మరియు 3616 రూపాయల నగదు విరాళాలను సేకరించడం జరిగింది. సేవా సంకల్పంలో సమిధులై పాల్గొన్న అన్ని రాజకీయ, సామాజిక వర్గాల మరియు విద్యార్థి యువజన సంఘాల వారితో పాటు విలువైన విరాళాలను అందించి నటువంటి సహృదయ దాతలకు ప్రతి ఒక్కరికి కూడాపేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలను వరద బాధితుల సహాయ సమైఖ్య, హెుళగుంద వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేషగిరి, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రెహమాన్, వార్డ్ మెంబర్ అబ్దుల్ సుభాన్, ఖాదర్,సలాం,, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.