PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూర్ లో జైజై గణేశా..బైబై గణేశా

1 min read

-భక్తి శ్రద్దల నడుమ నిమజ్జనం

-రంగులు చల్లుతూ డాన్సులు వేస్తూ..

-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ శబరి

-నందికొట్కూరులో ప్రశాంతంగా నిమజ్జనం

-ఆత్మకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గత ఐదు రోజులుగా పట్టణంలో ఎక్కడ చూసినా వినాయకుడు మండపాలతో ఉండడంతో భక్తాదులు పూజల్లో పరవశించి పోయారు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో.. బుధవారం రోజున ఉదయం నుండి నందికొట్కూరు పట్టణంలో కాలనీల్లో వినాయకుడికి చిన్నారులు మహిళలు కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. టెంకాయలు మరియు పూలు వినాయకునికి సమర్పిస్తూ ప్రత్యేకంగా ప్రసాదాన్ని భక్తాదులకు ప్రజలకు అందజేశారు.ప్రతి వినాయకుని దగ్గర లడ్డును వేలం పాటలో అధిక ధరల్లో దక్కించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు.పిల్లలు మరియు ప్రజలు వినాయకుని టీ షర్టులు ధరిస్తూ ఎర్రటి కండువాలు ప్రత్యేక దుస్తులు ధరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న షరాఫ్ బజార్ లో శ్రీరాములు, వార్త పాత్రికేయులు శేఖర్ మరియు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి బుధవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి,మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ బేబీ, నాగేశ్వరరావు,నెహ్రునగర్ కట్టుబడి శ్రీనివాసులు,టిడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,బంగారు వెంకటేశ్వర్లు,మురళీధర్ రెడ్డి ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు.సాయంత్రం నుండి కాలనీల్లో ఉన్న గణ నాథులను ప్రత్యేకంగా ట్రాక్టర్లలో తీసుకెళ్తూ ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులతో సందడి చేస్తూ పట్టణంలో నుండి జూపాడుబంగ్లా దగ్గర ఉన్న కేసీ కాలువలో జైజై గణేశా..బై బై గణేశా అనే కేరింతలతో వినాయకుడిని నిమజ్జనం చేశారు.పట్టణంలో ఉన్న దాదాపుగా 60 గణనాథులను నిమజ్జనం చేశారు.ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉదయం నుండి మరియు రాత్రి నిమజ్జనం పూర్తయ్యే దాకా నందికొట్కూరు పట్టణ రూరల్ సీఐ లు వై ప్రవీణ్ కుమార్ రెడ్డి,టి సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లు సురేష్ కుమార్, ఓబులేష్,తిరుపాలు, లక్ష్మీనారాయణ మరియు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.పట్టణంలోని నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

About Author