కర్ణాటక హరిదాసులు శ్రీ జగన్నాథ దాసుల వారి ఆరాధన మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని పేట శ్రీ రామాలయంలో ప్రసిద్ధ వాగ్గేయకారులు హరిదాసవరేణ్యులు శ్రీ జగన్నాథ దాసుల వారి ఆరాధనా మహోత్సవం వైభవంగా జరిగింది. అఖిల భారత మాధ్వ మహా మండల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త, సుధా పండితులు శ్రీ గోవర్ధనాచార్యులు మాట్లాడుతూ సంస్కృత కావ్యాలు ప్రాంతీయ భాషల్లో అనువాదం జరగడం సహజం .అయితే ప్రాంతీయ భాషలోని కావ్యము సంస్కృతంలోనికి అనువదించబడింది అంటే ఆ ప్రాంతీయ భాషల్లో వ్రాయబడిన ఆ కావ్యము యొక్క గొప్పతనం శ్రీ జగన్నాథ దాసుల వారిది. హరికథామృతసారమనే కన్నడ గ్రంథము సంస్కృతంలో వ్యాఖ్యానం చేయబడింది అంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చని శ్రీ జగన్నాథ దాసుల వారు గొప్ప కవి అని తెలియజేశారు. అఖిల భారత మాధ్వ మహా మండల్ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ ఆరాధన మహోత్సవం సందర్భంగా పలు పోటీలు ఉంచి బహుమతులు కూడా అందజేయబడ్డాయి. అంతేకాకుండా కర్నూలు నగరంలోని మాధ్వ బ్రాహ్మణులలో చదువుతున్న విద్యార్థులకు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలలో ప్రతిభను కనబరిచిన వారికి స్కాలర్షిప్లు కూడా ఇవ్వబడ్డాయి .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ మాళిగి హన్మేశాచార్యులు, శ్రీధర్ ఆచార్యులు ,శ్రీ జయ తీర్థ ఆచార్యులు, గాడి చర్ల ప్రదీప్, శ్రీ ప్రాణేష్, శ్రీ శ్యామ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.