ఉగ్ర నీడలో అఫ్ఘాన్.. 50 భారత అధికారుల తరలింపు
1 min readపల్లెవెలుగు : అప్ఘానిస్థాన్ లోని పలు ప్రాంతాలను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. ఈనేపథ్యంలో కాందహార్ కాన్సులేట్ కార్యాలయం నుంచి 50 మంది భారత అధికారులను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి తీసుకొచ్చింది. తాలిబన్ల అదుపులో పలు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో భారత అధికారుల భద్రత క్షీణిస్తోంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం వారిని ఢిల్లీకి తరలించినట్టు తెలిపింది. అఫ్ఘాన్ లో పరిస్థితులను సమీక్షిస్తున్న అధికారులు.. తాత్కాలికంగా కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేశారు. గత కొన్ని రోజులుగా అఫ్ఘాన్ బలగాలకు, తాలిబన్లకు మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.