ఆడిటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి
1 min readసొంత భవన ఏర్పాటుకు స్థలం కేటాయించాలి
ఏపీటిపి సీఏ రాష్ట్ర ముఖ్య సలహాదారు షరీఫ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కడప : రాష్ట్ర ఆడిటర్స్, టాక్స్ ప్రాక్టీషనర్స్, కన్సల్టెన్సీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పఠాన్ షరీఫ్ ఖాన్ కోరారు. గురువారం శ్రీ శ్రీనివాస రెసిడెన్సిలో వైయస్సార్, అన్నమయ్య జిల్లాల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షరీఫ్ ఖాన్ మాట్లాడుతూ అసోసియేషన్ భవన నిర్మాణానికి జిల్లాలలో ఐదు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాలు లేని ఆడిటర్లకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఆడిటర్ లేనిదే ప్రభుత్వానికి ఆదాయం లేదని తెలిపారు. ఇన్కమ్ టాక్స్ పై అవగాహన కోసం ప్రతినెల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, అధికారము సాధించేందుకు వీలవుతుందని తెలిపారు. అందుకే అసోసియేషన్ అవసరమని చెప్పారు. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ నవంబరు, డిసెంబరు వరకు పొడిగించాలని కోరతామన్నారు. కేరళ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వరదలు వచ్చి ప్రజా జీవితాన్ని అతలాకుచలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే నాయకత్వ దృష్టికి తీసుకురావాలని కోరారు. కోవిడ్ సమయంలో ఎంతోమందిని ఆదుకున్నామని చెప్పారు. కడపలో అసోసియేషన్ భవనం నిర్మిస్తే రూ. 2లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆదాయ మార్గాలు పెంచుకోవాలని తెలిపారు. జిల్లా కార్యదర్శి జయకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా వృత్తి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. అందుకే అవగాహన సదస్సుల ద్వారా సందేహాలు నివృతి అవుతాయని తెలిపారు. అనంతరం వైయస్సార్, అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పోసా మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా గండికోట శివకుమార్, కార్యదర్శిగా జయకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా వడ్డీ నాగరాజు, అష్రఫ్ అలీఖాన్, పఠాన్ తౌహీద్ ఖాన్, కోశాధికారిగా శ్రీనివాసులు, ఈసీ మెంబర్స్ ఎన్నుకున్నారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు, నూతన కమిటీని అభినందించారు. అలాగే ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ ని పూల బొకే ఇచ్చి శాలువా కప్పి సన్మానించడం జరిగింది, షాహిదర్బార్ హోటల్ చేసిన వంట రుచులు భోజనంలో అనేక రకాలు ఆడిటర్స్ అసోసియేషన్ తరపు నుండి భోజనాలు గూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వరదరాజులు, చంద్రశేఖర్, శివకుమార్, గౌరవాధ్యక్షులు కుమార్, చంద్రమౌళి, శ్రీనివాసరావు, సత్యనారాయణ రాజు, ఆదినారాయణ రెడ్డి, ఆడిటర్స్, టాక్స్ ప్రాక్టీషనర్స్, లయన్ పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.