విపత్తుల పరిస్ధితుల్లో పారిశ్రామిక వేత్తల స్పందన అభినందనీయం
1 min readజిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విపత్తుల పరిస్ధితుల్లో వరద బాధితులను ఆదుకోవడంలో పారిశ్రామిక వేత్తలు స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో పెదపాడు మండలం ఏపూరు కు చెందిన స్నేహా ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫౌల్ట్రీఫీడ్ మిల్) కంపెనీకి చెందిన ప్లాంట్ మేనేజరు కె. శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మేనేజరు కుమార్, సేఫ్టీ ఆఫీసర్ ఆర్. దినేష్ రూ. 5 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ వారికి చెక్కును అందజేశారు. అలాగే ఉంగుటూరుకు చెందిన గ్రీన్ ఆసియా ఇన్ ఫెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రౌన్ ప్రోసెసింగ్) తరపున జనరల్ మేనేజరు కెవి ప్రకాశరెడ్డి, హెచ్ ఆర్ వి. సత్యనారాయణ, రూ. 3 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ వారికి అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విపత్తుల పరిస్ధితుల్లో బాధితులను ఆదుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జిఎం వి. ఆదిశేషు, డిప్యూటీ ఛీఫ్ ఇన్స్పేక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ ఎపిపిసిబి కె. వెంకటేశ్వరరావు ఉన్నారు.