వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల పోరాటం ఉదృతం..
1 min readసుప్రీంకోర్టు తీర్పును కొట్టివేయాలి:జేఏసీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల మంతా కలసి పోరాటాలు ఉదృతం చేస్తామని మాలల జేఏసీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శుక్రవారం మధ్యాహ్నం 3:30 కు జై కిసాన్ పార్కులో మాల మహానాడు తాలుకా అధ్యక్షుడు అచ్చుగట్ల నాగేష్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా నాయకులు సాంబశివుడు మరియు ఆయన సహచర మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.ఈ యొక్క ఉద్యమం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు అందరం కలిసి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామని వారు అన్నారు. అంతే కాకుండా సుప్రీం కోర్టు ఈ వర్గీకరణను కొట్టివేయాలని అంతవరకు ఈ మా ఉద్యమం ఆగదని రాబోయే రోజుల్లో గ్రామ, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మాలలను ఐక్యం చేసి వర్గీకరణను రద్దు చేసేంత వరకు పోరాడుతామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు. మాల మహానాడు సీనియర్ నాయకుడు డాక్టర్ రాజు, అచ్చన్న,అర్లప్ప,ఎర్రన్న, కృపాకర్ మల్లయ్య చరణ్ మనోహర్ ప్రవీణ్ ఏసన్న శేఖర్ రమేష్ అంకన్న తదితరులు పాల్గొన్నారు.