మా ప్రభుత్వంలోనే ముందంజలో మహిళలు..
1 min readవరద బాధితులకు మెప్మా ఒక లక్ష
సూపర్ బజార్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: టిడిపి ప్రభుత్వ హయాంలోనే మహిళలు సగర్వంగా గౌరవంతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదురుగా కేజీ రహదారి ప్రక్కన మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే ప్రారంభించారు.మహిళలు చేస్తున్న వ్యాపారాలు ఏమేమి చేస్తున్నారనే వాటి వస్తువులను ఆ మార్కెట్లో ఏర్పాటు చేశారు.మహిళల దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రభుత్వ రుణాలతో మీరు ఇంకా అభివృద్ధి చెందాలని మహిళలు ప్రభుత్వం అందిస్తున్న వాటి పథకాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే మహిళలకు సూచించారు.తర్వాత గత మూడు రోజులుగా విజయవాడలో వరద బాధితులతో నేను స్వయంగా వెళ్లి వారితో మాట్లాడడం జరిగిందని నిత్యావసర వస్తువుల కిట్లను వారికి పంపిణీ చేశామని ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సీఎం చంద్రబాబు కూడా వెంటనే అధికారులను పార్టీ నాయకులను అప్రమత్తం చేశారని అన్నారు. నందికొట్కూరు మెప్మా సిబ్బంది ఒకరోజు వేతనం ఒక లక్ష రూపాయలు వరద బాధితులకు అందజేశారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఎమ్మెల్యేను మరియు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ బేబీ ని శాలువా పూల మాలలతో టీఎంసీ మెప్మా అధికారి శాంతకుమారి మరియు మహిళలు సన్మానించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మరియు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ జాకీర్ హుస్సేన్,పలుచాని మహేశ్వర్ రెడ్డి,రసూల్ ఖాన్, ముర్తుజావలి,ఎస్ఎండీ జమీల్,సౌదీ చాంద్,ప్రాతకోట వెంకటరెడ్డి,కాటేపోగు నాగ సురేష్,రాజన్న,నిమ్మకాయల మోహన్,కళాకర్ మరియు పొదుపు మహిళలు పాల్గొన్నారు.