రైతన్న మమ్మల్ని చంపేస్తావా.. ద్విచక్ర వాహనదారుల ఆవేదన..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఏటా పంటల కాలం వచ్చిందంటే మండలంలోని రహదారి వెంబడి ఉన్న గ్రామాల రైతులు ధాన్యం ఆరబోయడం వాహనాలు అదుపుతప్పి ద్విచక్ర వాహనదారులు మృత్యుపాలవుతున్నారు బాధ్యత లేకుండా దేశానికి అన్నం పెట్టే రైతన్న సొంత స్వార్థం కోసం ధాన్యం ఆరబోయడం వాటిని కాటా వేసి రోడ్డు వెంబడి వాహనాలు నిలిపి లోడ్ చేయడంతో రాత్రిపూట వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురవడం జరుగుతోందని స్థానికంగా పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించిన కనీసం స్పందించడం లేదని కల్లాలను నివాసాలుగా మార్చుకొని లేకపోతే అమ్ముకొని రైతుల రోడ్డు మీద ధాన్యం ఆరబోయడం ఎంతవరకు సమంజసం అని రహదారి వెంట ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమ వెళ్లే భారీ వాహనాలు నిత్యం వందలకొద్దీ తిరుగుతుంటాయి గతంలో రహదారి ప్రమాదాలలో చాలామంది చనిపోవడం జరిగిందని ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ఎస్ఐ వీటిపై దృష్టి సారించి సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు.