కోనసీమను తలపిస్తున్న రాయలసీమ పంట పొలాలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఏడాది సమృద్ధిగా వర్షాలు పడడం రైతులు వరి పంట వేయడంతో మండలంలో పచ్చదనం నెలకొంది వందల కొద్ది ఎకరాల్లో వరి పంట చుట్టూ పచ్చగా కోనసీమను తలపిస్తూ రహదారి వెంబడి వెళ్లే ప్రయాణికులకు దృశ్యం ఆహ్లాదకరంగా కనబడుతుంది చేలలో చెట్లు చెట్టు కింద రైతులు సేద తీరుతున్న సుందరదృశ్యం పల్లె వెలుగు కెమెరా క్లిక్ మనిపించింది చెట్ల వల్ల ఎంత ఉపయోగం పకృతిలో పచ్చదనం అంతే అవసరమని ఇలాంటి పొలాలు అరుదుగా కనబడడం జరుగుతుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు చెల గట్ల మీద ఉన్న చెట్లు పదోపరక కో రైతులు అమ్ముకుంటున్నారని చెట్టు నీడ పడితే పంట రాదని చెట్లను నరికి వేయడం తో వాతావరణం వేడెక్కుతుందని సరైన సమయానికి వర్షాలు కురవక ప్రకృతి ప్రకోపానికి మనుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా చెట్లు నాటాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.