సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
1 min readఆటోనగర్ ప్రెసిడెంట్ అరుణతార నాగేశ్వరరావు
ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏచూరి సంతాప సభ
పెద్ద ఎత్తున పాల్గొన్న అసోసియేషన్ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరంలోటని ది ఏలూరు ఆటో మొబైల్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణతార నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో ఉన్నత కుటుంబంలో పుట్టి వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులైన సీతారాం ఏచూరి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షునిగా పనిచేసి అంచెలంచెలుగా సిపిఎం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారని కొనియాడారు.జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడో సారి పనిచేస్తూ మరణించడం సిపిఎం పార్టీతో పాటు వామపక్ష ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆయన మరణానికి సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ,ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు, కమిటీ సభ్యులు గుమ్మళ్ల వెంకట సూర్యనారాయణ, సయ్యద్ చోటే, షేక్ జుల్ఫీ, మాజీ ఉపాధ్యక్షులు పల్లా అప్పారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్,పర్వేజ్,షఫీ, తదితరులు పాల్గొన్నారు.