పాత్రికేయులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయం
1 min readపాత్రికేయ గణపతి ఉత్సవ సమితి వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీనియర్ గ్యాస్టో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వినాయక చవితి సందర్భంగా జర్నలిస్టులు మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న మీడియా సెంటర్ వద్ద పాత్రికేయ గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వివరించారు. రానున్న రోజుల్లో మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా దేశానికే కర్నూలు నగరం మార్గదర్శనం కావాలని ఆయన కోరారు. సాధారణంగా వినాయక చవితి సందర్భంగా ప్రమాదకర రసాయనాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కు తయారుచేసిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారని వాటిని నీటిలో విభజన చేయడం ద్వారా నీటి కాలుష్యం, వాయు కాలు కాలుష్యం కలిగి దుష్ఫలితాలు ఏర్పడతాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం అధికం కావడం వల్ల మానవాళి మనుగడతోపాటు సర్వ ప్రాణవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వివరించారు. వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. ఫలితంగా భూ వాతావరణం వేడెక్కి ఒకసారిగా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. పర్యావరణం దెబ్బతినడం వల్లే ఇటీవల కాలంలో ఊహించని విధంగా తుఫాన్లు కరువు కాటకాలు చోటుచేసుకుని మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆయన వివరించారు .ఇలాంటి పరిస్థితులను తప్పించేందుకు వీలుగా ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మార్గదర్శకులుగా మారడం అభినందనీయమని వివరించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని వారికి ఆశించిన స్థాయిలో వేతనాలు నేనప్పటికీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు .జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అందరికీ వినాయకుని ఆశీస్సులు అంది ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ,శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు.