వరద బాధితుల సహాయార్థం చీరల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన బాదిత కుటుంబాలను ఆదుకోవడంలో తమ వంతు సహాయంగా విజయవాడ రాజీవ్ నగర్ లో వరద బాధితులకు చీరలు పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని కొక్కరాయపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సి. హేమలత విజయవాడ లో రాజీవ్ నగర్ వరద బాధితులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం హర్షించదగ్గ విషయమని ఆమె ఇలాంటి సహాయ సహకారాలు అందించడం హర్షించేదగ్గ విషయమని ఆయన అన్నారు. ప్రార్థించే పెదవులు కన్నా, సాయం చేసే చేతులు మిన్న అనే విధంగా హేమలత వరద బాధితులను తమ వంతు బాధ్యతగా ఆదుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠశాలలోనే కాకుండా పాఠశాల బయట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన హేమలత చేసిన సహాయాన్ని కొనియాడారు.