రాష్ట్ర మంత్రి టి.జి భరత్ చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్కు విరాళాలు
1 min readదాతలను అభినందించిన మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆపదలో ఉన్నప్పుడు చేయూతనిచ్చేందుకు ముందుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీ.ఎం.ఆర్.ఎఫ్ కు మంత్రి టి.జి భరత్ చేతులమీదుగా పలువురు విరాళాలు అందించారు. ది కర్నూల్ క్లబ్ తరుపున రూ.5 లక్షలు, ది కర్నూల్ యునైటెడ్ క్లబ్ తరుపున రూ. 2 లక్షలు, కర్నూలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ 4వ వార్డు తరుపున వార్డు ఇంచార్జి ఊట్ల రమేష్ బాబు, బూత్ ఇంచార్జీల ఆధ్వర్యంలో సేకరించిన రూ. 60 వేలు, 48వ వార్డులోని 3వ బూత్‌కు చెందిన కే.ఈ మధులతా గౌడ్ రూ.30 వేలు విరాళం ఇచ్చారు. దాతలు ఈ చెక్కులను మంత్రి టి.జి భరత్‌ను ఆయన కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టి.జి భరత్ అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో చిన్నసహాయమైనా ఎంతో ఉపయోగపడుతుందని టి.జి భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ క్లబ్ సెక్రటరీ బాలచంద్రా రెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రమౌలీశ్వర రెడ్డి, ట్రెజరర్ కే.ఈ శివరామ్ గౌడ్, ఈ.సి మెంబర్ దుర్గా ప్రసాద్ రెడ్డి, సలీం బాషా, ప్రెసిడెంట్ భీమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ బలరాం, ట్రెజరర్ సుధాకర్ బాబు, జనరల్ సెక్రటరీ రాముడు, యేసు రత్నం, భూపాల్ రెడ్డి, సుగుణాకర్ గుప్త, ఊట్ల రమేష్, మన్సూర్ ఆలీఖాన్, కార్తీక్, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.