PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాట తప్పని మడమ తిప్పని నేత జగనన్న

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుందలో వైఎస్సాన్సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వ్యాఖ్యహొళగుందలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిహాజరైన వైఎస్సాన్సీపీ కార్యకర్తలుహొళగుంద. ఎన్నికల ముందు నూపర్ సిక్స్ అన్నావు… ముఖ్యమంత్రి పీఠమెక్కి మూడు నెలలవుతున్నా ఆ ఊసే లేదు….ఇదే చంద్రబాబు నైజం. చెప్పిన మాట.. ఇచ్చిన హామి ఎన్నడూ నెరవేర్చడని, ఇందుకు బాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రి పాలనే నిదర్శనమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు. శనివారం ఆయన బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్తో కలిసి స్థానిక తేరుబజారులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నాడు ఓట్ల కోసం అమ్మకు వందనం వధకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు అంటూ ఉదరగొట్టిన నాటి హామీ నేడు సోషెల్ మీడియాలో కామెడీ సీన్గ చక్కర్లు కొడుందన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం సూపర్ సిక్స్ పేరిట హామిలిచ్చినా చంద్రబాబు నేడు నిండు అసెంబ్లీలో సూపర్ సిక్స్ అంటేనే భయమేస్తోందని ఖజాన ఖాళీ అని ఉన్న మాట చెప్పేనడన్నారు. ఎరెక్షన్లో 99 శాతం హామీలను అమలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడానికి ఈవీయంల ట్యాంపరింగ్ జరిగిందన్నారు. నేడు జగనన్న ఉండి ఉంటే అమ్మ ఒడి, అమ్మకు వందనం, రైతు భరోసా, వంట నష్ట పరిహారం, పంటకు ఇన్సురెన్స్ డబ్బులు వచ్చేవన్నారు. ఇవన్నీ చేసిన జగనన్నకు తామేసిన ఓట్లు ఎక్కడ పోయాయని ప్రతి అక్క చెల్లెమ్మలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దీంతో మాట తిరగేసి దొంగదారిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పాలనను అందరు భరించక తప్పదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలెవరు అధైర్య పడవద్దని ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోన ఇచ్చారు. అధికారులు ఇబ్బంది పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా. ఏ పని కావాలన్నా పోరాటం చేసి చేసి పెడ్తానని మీరు కూడా నాకు అండగా ఉండాలని కోరారు, అలూరు నియోజకవర్గంలో రోడ్డు, లాగునీటి సమస్య తీవ్రంగ ఉందని. హొళగుంద నుంచి ధణాపురం వరకు రోడ్డు అధ్వాన్నంగా ఉండి బస్సులు కూడా రద్దవుతున్నాయన్నారు. దీని పై అనేక సార్లు కాంట్రాక్టర్ వెంట వడినా స్టేట్మెంట్ పెరగడం వల్ల ఆయన ముందుకు రావడం లేదన్నారు దీంతో తాత్కాలిక మరమ్మతు చేపట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు కొందరు స్వార్థపరుల మాటలు వినద్దని టిడిపిలో పోయిన ఖజానా ఖాళీ అంటున్న చంద్రబాబు మీకేమిస్తాడని ఎమ్మెల్యే అన్నారు ఏ సమస్య వచ్చినా ఎవరు భయపడుద్దని మీకు అండగా ఉంటానని 2029 లో జగనన్న సీఎం కావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ షఫీ ఉల్లా నాయకులు కోకిల తోట శేషప్ప మాజీ సింగల్ ఇండో చైర్మన్ మల్లికార్జున ఎస్కే గిరి ఎంపిటిసి మళ్ళీ హనుమప్ప వెంకటరెడ్డి కృష్ణమోహన్ రామకృష్ణ వెంకట్రామిరెడ్డి రంగస్వామి పంపాపతి కాకి పకీరప్ప శంకర్ రవి స్వామి మంజు నాయక్ దుర్గన్న కింద వాళ్ల కృష్ణయ్య సోమిరెడ్డి నాగప్ప చంద్ర ఏం రహమతుల్లా ఆసిఫ్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author