వాల్మీకి బోయ సంఘం పట్టణ అధ్యక్షులుగా రాజశేఖర్..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు వాల్మీకి బోయ సంఘం పట్టణ యూత్ వింగ్ అధ్యక్షులుగా (ఏబీవీబీ ఎస్) నల్లబోతుల రాజశేఖర్ నియమితులయ్యారు.రాష్ట్ర బోయ వాల్మీకి సంఘం అధ్యక్షులు డాక్టర్ విక్రమ్ నాయుడు,రాష్ట్ర జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాజశేఖర్ ను పట్టణ అధ్యక్షులుగా నియమించినట్లు రాజశేఖర్ తెలిపారు.అదేవిధంగా కమిటీ సభ్యులైన క్రాంతి నాయుడు కు,నంద్యాల జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులకు రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.వాల్మీకి జాతి బిడ్డగా వాల్మీకి జాతి అభ్యుదయానికి పాటుపడతానని వాల్మీకి జాతిని ఎస్టీ జాబితాలో చేర్చుటకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడుతానన్నారు. వాల్మీకులలో ఐక్యత మరియు వారిని చైతన్యం పరుస్తూ వాల్మీకి బోయ సంఘాన్ని నందికొట్కూరులో ముందుకు తీసుకు వెళ్తానని అంతేకాకుండా వాల్మీకిలకు ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి మరియు జిల్లా రాష్ట్ర కమిటీ వాల్మీకి సంఘం నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని రాజశేఖర్ పాత్రికేయులతో అన్నారు.