పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలు
1 min readనలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది
చోరీలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు
జంగారెడ్డిగూడెం డిఎస్పి యు రవిచంద్ర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం పట్టణంలో అయ్యప్ప టౌన్ షిప్ టీచర్స్ కాలనీ, లో తాళాలు వేసి ఉన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీ కి పాల్పడి నట్లు సమాచారం అందటంతో సంబంధి అప్రమత్తమై బంగారం, వెండి, వస్తువులను దొంగిలించిన నిందితులను పోలీసులు శాఖ చక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పోలీసులు60గ్రాములు బంగారం , 500గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో పోలీస్ లు వివరించారు.ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డిఎస్పి యు. రవిచంద్ర మాట్లాడుతూ సదర్ ముద్దాయిలు గతంలో కామవరపుకోట మండలం రావికంపాడు లో చోరీ చేసినట్లు అక్కడ చోరీ సొత్తు కూడ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తు విలువ సుమారు నాలుగు లక్షల ఉంటుందని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు,ఎస్ఐ జబీర్, ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర సిబ్బందిని డి.ఎస్.పి అభినందించరు. ఇటువంటి చోరీలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ తమ వస్తువులను ముందస్తుగా లాఖరులలో ఉంచాలని, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పోలీసులకు ముందస్తు సమాచారం అందజేయాలని. విలువైన వస్తువులను చోరీ పడడం కన్నా తగు జాగ్రత్తలు చేసుకోవడం ముఖ్యమని సూచించారు.