ఎన్నికల ప్రచారంలో చేసిన 6 వాగ్దానాలలో 100 రోజుల్లో 5 అమలు చేశాం
1 min readఎంపీ పుట్టా మహేష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల సమయంలో చేసిన 6 వాగ్దానాలలో 5 అమలు చేశామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. ఎన్టీఎ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 100 రోజులైన సందర్భంగా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ
1) వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ది.
2) పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్లు నిధులు.
3) వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఏలూరు లో నిలుపుదల.
4) ఏలూరు లో జాబ్ మేళా 566 మందికి ఉద్యోగ నియామక పత్రాల అందచేత.
5) పామాయిల్ దిగుమతులపై 27.5% సుంకం విధింపు ద్వారా పామాయిల్ రైతులకు టన్నుకు ధర షుమారు 16,500/- తో పాటుగా దేశవ్యాప్తంగా వంటనూనె గింజలు పండించే రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.6వ అంశం త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు.బాస్మతి రైస్ తో పాటుగా వివిధ రకాల పంటల ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధింపు ప్రక్రియ 2సంవత్సరాలు పడుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలసి మాట్లాడానని, నీతి ఆయోగ్ సభ్యులతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడామన్నారు. దానిని మూడుక నెలల్లో పూర్తిచేశామవ్నారు. జిల్లాలో స్కిల్ సెన్సెస్ చేస్తామని, రీసెర్చ్ సెంటర్ ను ఢిల్లీలో పెట్టామని, పామాయిల్ రైతులకు ఇంక్యుబేషన్ సెంటర్ తీసుకొస్తామన్నారు. మనకు ఎంతో సహకరిస్తున్న కామర్స్ సెక్రటరీ సునీల్ బర్త్వల్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నామీద పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తానన్నారు. తదుపరి వేలాదిగా తరలివచ్చిన పామాయిల్ రైతులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఎడ్లబండి ప్రతిమను అందించి భారీ గజమాలతో బొకేలతో సత్కరించారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అవిరళ కృషి చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను అభినందించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ 100 రోజుల పాలన లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంపీని అభినందించారు. పామాయిల్ రైతు సంఘాల నాయకులు ఆచంట సూర్య నారాయణ, బొబ్బా వీరరాఘవ రావు, ఉండవల్లి వెంకట్రావు, వంకినేని రామరాజు క్రాంతికుమార్ రెడ్డి, పెనుమత్స రామరాజులు మాట్లాడుతూ పనిచేసే ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, పనిచేసే ఉప ముఖ్య మంత్రిగా పవన్ కళ్యాణ్, పనిచేసే ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ ఉండటం ఏలూరు జిల్లా వాసుల అదృష్టం అన్నరు.