మాదకద్రవ్యాల నిర్మూలనకై కరపత్రాలు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల పక్షోత్సవాలలో భాగంగా ఏడవ రోజుఆదివారం జే.బీ.వీ.ఎస్. ది ప్రజర్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జే.బీ.వీ.ఎస్. ది ప్రజర్వర్ సేవా సమితి వ్యవస్థాపకుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అశోక్ మాట్లాడుతూ, మత్తు మాదకద్రవ్యాల వల్ల యువత మత్తులో తప్పుదోవ పడుతున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో మాదకద్రవ్యాల వల్ల ఎలాంటి అనార్ధాలు ఎదురవుతాయో, ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయో యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉందని ఆయన అన్నారు, మాదకద్రవ్యాలు వాడడం వలన యువతి యువకులకు అలాగే ప్రజలకు కలిగే వివిధ నష్టాలు గూర్చి విషయాలను కరపత్రాల మీద ముద్రించి కడప నగరంలో ముఖ్య ప్రాంతాలైన పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, రాజీవ్ పార్క్, శిల్పారామం తదితరులు ప్రాంతాల్లో నే కాకుండా అన్ని మండల కేంద్రాలలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల యువతుల మంచి మార్పు వస్తుందన్న నమ్మకం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ నమ్మకంతో మాకందరికీ ఎంతో ఆనందం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతున్నదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమరిటన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు భరత్, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు సంస్థ సభ్యులైన శ్రీకాంత్, అరుణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.