ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు
1 min readఆకట్టుకున్న మక్కా, మదీన నమూనాలు
మాధవరం లో రక్త దాన శిబిరం
గట్టి బందోబస్తు పోలీసు బందోబస్తు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ముస్లిం ల ఆరాధ్య దైవమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినంగా భావించే మీలాద్ ఉన్ నబి పండుగ వేడుకలు సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం జామీయ మసీదు నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ఈద్గ వరకు మహమ్మద్ ప్రవక్త తలనీలాలను భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ నుండి మసీదు చేరుకుని తలనీలాలను ప్రదర్శన నిర్వహించారు. వచ్చిన ముస్లిం లు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మత గురువులు, పెద్దలు మాట్లాడుతూ అల్లాహ్ తరువాత ముస్లింలు అత్యధికంగా గౌరవించేది మహమ్మద్ ప్రవక్తనే అన్నారు. అందుకే ఇస్లాంలో ఆయనకు అంత గౌరవం ఉందని తెలిపారు. ఆ ప్రవక్త అనుసరించిన జీవనశైలినే ముస్లింలు ఆచరిస్తుంటారని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ముస్లింలు మహమ్మద్ ప్రవక్తపై భక్తితో మీలాద్ ఉన్ నబి పండుగగా ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రబీ ఉల్ అవ్వల్ 12వ రోజు అంటే సెప్టెంబర్ 16న మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును జరుపుకుంటారు తెలిపారు. ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి.
మాధవరం లో : – మిలాద్ ఉన్ నబి వేడుకలు సందర్భంగా స్థానిక మసీదు నుండి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఉచిత రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు.వగరూరు లో : – మిలాద్ ఉన్ నబి వేడుకలు సందర్భంగా వగరూరు గ్రామానికి చెందిన ఉమ్మీద్ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అనాధలకు భోజనాలు పంపిణీ చేశారు.పోలీసు బందోబస్తు : – ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆధ్వర్యంలో మంత్రాలయం ఎస్సై పరమేష్ నాయక్, మాధవరం ఎస్సై విజయ్ కుమార్ తమ సిబ్బందితో పోలీసు బందోబస్తు నిర్వహించారు.