వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వేరుశనగ పంటలను పరిశీలించిన బుట్టా రేణుక
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను గోనెగండ్ల మండలం వేముగోడు, హంద్రీకైరవాడి గ్రామాలలో పత్తి,వేరుశనగ, పంట పొలాలను పరిశీలించిన వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఎమ్మిగనూరు నియోజవర్గంలో దెబ్బతిన్న పంటలకు తక్షణమే అధికారులు పంట భీమ నమోదు చేసి, ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వర్షాలు లేకపోయిన ,వర్షాలు ఎక్కువైనా,పంటలు దెబ్బతింటాయి.ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజేశారు. వర్షానికి తడిసిన వేరుశనగ,పత్తి పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.ఈ కార్యక్రమంలో బుట్టాశివనీలకంఠ,వేముగోడు కృష్ణారెడ్డి, అల్వాల ప్రమోద్ రెడ్డి,గోనెగండ్ల బందేనవాజ్,మురళినాయుడు,మన్సూర్,దొరబాబు,గోవిందు,గడ్డం నారాయణరెడ్డి,కాశీ విశ్వనాథ్ రెడ్డి,రాముడు,రవికుమార్ రెడ్డి,మోహన్ రెడ్డి,పెద్దారెడ్డి,మహేశ్వరరెడ్డి, గంగాధర్,పాండురంగారెడ్డి, శ్రీరాంరెడ్డి,లక్ష్మిరెడ్డి, శ్రీనివాసులు,పులికొండ, లోకనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి,టీచర్ మునెప్ప,వెంకటేశ్వర రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,రంగారెడ్డి,జైపాల్ రెడ్డి,బాబులాల్, ఆయా గ్రామ నాయకులు,కార్యకర్తలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.