సమన్యయంగా, సమిష్టి కృషితో స్వచ్ఛభారత్ ను నిర్మించుకుందాం
1 min readసిఐ పురుషోత్తమ రాజు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రతి ఒక్కరూ తమ వంతు కృషితో సమన్వయంగా పరిసరాల పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ భారత్ కొరకు పాటుపడదామని సిఐ పురుషోత్తమరాజు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ లో భాగంగా గ్రామపంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెన్నూరు మండలాన్ని ఆరోగ్యకరమైన మండలంగా తీర్చిదిద్దుకుందామని మండల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. మనం పరిశుభ్రత పాటిస్తే మన కుటుంబం బాగుంటుందని, అలాగే మన కుటుంబంతోపాటు మన గ్రామం మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛభారత లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు. అనంతరం మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సాధారణ సమయంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని అందుకే ప్రభుత్వ అధికారుల పిలుపుమేరకు ప్రజలు ఆరోగ్యపరంగా పరిసరాలపరంగా ఆరోగ్యంగా ఉండి కుటుంబాలను సంక్షేమంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోజెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి , ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ సర్పంచ్ వెంకటసుబ్బయ్య, గ్రామ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి,మాజీ సర్పంచ్ జీన్ భాస్కర్ రెడ్డి ,నాయకులు కల్లూరు విజయ భాస్కర్ రెడ్డి ,వారిష్ ,పలువురు వార్డు సభ్యులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.