PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వచ్ఛమైన పట్టణంగా తీర్చి దిద్దడమే నా ధ్యేయం..

1 min read

గత ఐదేళ్లు అభివృద్ధి వెనక్కి

మంచినీటి పథకానికి మళ్లీ జీవం పోస్తాం

మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి

మొక్కలు నాటిన ఎమ్మెల్యే జయసూర్య..వైస్ చైర్మన్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాబోయే రోజుల్లో నందికొట్కూరు ను స్వచ్ఛమైన నందికొట్కూరు పట్టణంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నిన్న ప్రారంభం అయిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో నిన్న ఉ.11 గం.కు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ బేబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొదటగా కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు.తర్వాత పటేల్ సెంటర్ లో విద్యార్థులందరూ భారీగా మానవ హారంగా నిలబడ్డారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు తావు లేకుండా పట్టణాన్ని అభివృద్ధికే పట్టం కడతామని గత ఐదేళ్ల కాలంలో అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే అలగనూరు రిజర్వాయర్ నుండి నందికొట్కూరుకు మంచి నీరు రావడానికి అప్పట్లో సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారని కానీ వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకు వెళ్లలేకపోయిందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మళ్లీ వీటికి జీవం పోసి నందికొట్కూర్ కు నీళ్లను తీసుకువస్తామని పట్టణంలో ముఖ్యంగా లైట్లు డివైడర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అదేవిధంగా మన చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావని గత ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే అన్నారు.తర్వాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే మరియు వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మరియు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్, చిన్నరాజు,క్లస్టర్ ఇంచార్జి ముర్తుజావలి,ఎస్ఎండీ జమీల్,లాయర్ జాకీర్ హుస్సేన్,రసూల్ ఖాన్,సౌదీ చాంద్,పెరుమాల్ల శ్రీనాథ్, పిఈటి రవి,శ్రీ రామ థియేటర్ రామిరెడ్డి,మున్సిపాలిటీ & పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

About Author