దేశం మనది. బాధ్యత మనది.. స్వచ్ఛత సహి మానవహారం..
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల: గడివేముల మండలం లో అన్ని గ్రామపంచాయతీ లలో స్వచ్చత హి సేవ 2024 కార్యక్రమం మంగళవారం నాడు ప్రారంభం అయింది. అని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపరచడం,పారిశుధ్య పనులు చేసే వారికి ఆరోగ్య సేవలు అందించడం,వారికి మెడికల్ టెస్ట్లు చేయడం,వారికి ఆరోగ్య భీమ ల గురించి అవగాహన కల్పించి,భీమా చేయించడం,గ్రామాలలో చెత్త దిబ్బలను గుర్తించి,వాటిని తొలగించి,ఆ చుట్టుపక్కల లో నివసిస్తున్న వారిని అవగాహన కల్పించి చెత్త వేయకుండా చేయడం,షాపులు,హోటల్ ఉన్న వారిని చెత్త బుట్ట పెట్టుకొని,వాడాలి,చెత్తను బయట గాని,రోడ్డు పై గాని,కాలువలలో వేయకుండా నిరోధించడం…ఇంటింటికీ తిరిగి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు .అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి లేదా నిర్మూలించాలి అనే సంకల్పం ప్రజలలో తీసుకోరావడానికి అనే పలు అంశాలు లతో మండలంలోని అన్ని గ్రామాలలో ర్యాలీలు నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు.ఈ కార్యక్రమం 17 సెప్టెంబర్ నుండి ఒకటి అక్టోబర్ వరకు నిర్వహించడం జరుగుతున్నారు. గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మనోహరంగా ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో , గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు ,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.