మహాగణపతి లడ్డు..రూ. 2లక్షలు
1 min readవేలంలో దక్కించుకున్న స్వస్తిక్ డెవలపర్స్ యజమాని సురేష్ బాబు
కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద తుంగభద్ర నదీ తీరాన వెలిసిన 63 అడుగుల మహాగణపతి లడ్డు వేలంపాటలో ఓ భక్తుడు రూ. 2 లక్షలకు దక్కించుకున్నాడు. కర్నూలు జిల్లా మొత్తంలోనే అతి ఎక్కువ ధరకు పలికిన లడ్డూను కాంచనం సురేష్ బాబు ( స్వస్తిక్ డెవలపర్స్ ) వారు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా స్వామి వారి హుండీని రూ.1.45 లక్షలకు చింటు, భరత్, వికాస్ లు కలిసి దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలం పాటను మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య సమక్షంలో నిర్వాహకులు కళ్యాణ్ వేలం పాట నిర్వహించగా లడ్డూ, హుండీ కి భారీ మొత్తంలో ధర పలికింది.