ప్రతి ఒక్కరికీ శాస్త్రీయ విజ్ఞానం అవసరం – జనవిజ్ఞాన వేదిక
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం,శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించే ఉద్దేశ్యంతో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు ఈ సంవత్సరం కూడా జరగనున్నాయని కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు నరసింహారెడ్డి కోరారు. జలదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కుమార్ చేతుల మీదుగా చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీల గోడ పత్రికలు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే మూఢ నమ్మకాలను విడనాడేలా ప్రోత్సహించాలని అన్నారు. శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో,మండల స్థాయిలో,జిల్లా స్థాయిలో,రాష్ట్ర స్థాయిలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.ఈ సంవత్సరం పాఠశాల స్థాయిలో సెప్టెంబర్ 25 వ తేదీన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని కావున మండలంలో ఉన్న 13 ఉన్నత పాఠశాలలలో చదువుతున్న 8,9,10 తరగతుల విద్యార్థులు పాఠశాల స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొనేలా కృషి చేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు,నీలోఫర్,శివ శంకర్,రామ పుల్లారెడ్డి, పక్కిరయ్య,మురళీమోహన్,పురంధర్, గురుస్వామి,షబానా,మహేశ్వరి, వెంకట సుబ్బమ్మ,స్వాతి,సౌభాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.