వరద బాధితులకు అండగా (మెప్మా).. భారీ విరాళం
1 min readమెప్మాసిటీ మిషన్ మేనేజర్ కె సుధాకర్
ఎమ్మెల్యే చంటి కి మేయర్ నూర్జహాన్ పెదబాబు కు చెక్కు అందజేత
మెప్మా సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరదలతో అతలాకుతలం అయిన కుటుంబాలకు అండగా నిలబడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ( మెప్మా ) ఆధ్వర్యంలో భారీ రిలీఫ్ ఫండ్ ను స్వయం సహాయక సంఘ సభ్యుల ద్వారా గ్రూపు కు 100 రూపాయల చొప్పున మెప్మా విభాగం విరాళాలు కలెక్ట్ చేయడం జరిగింది. ఏలూరు లో ఉన్న 4500 మెప్మా సంఘాలకు గాను 100 రూపాయలు చొప్పున 4,50,000/- రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మరియు నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు వారి చేతుల మీదుగా బుధవారం ఇవ్వడం జరిగిందని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కె.సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ ఇంత ఫండ్ అందరి భాగస్వామ్యంతో కలెక్ట్ చేసి మెప్మా వారికి సహాయం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలాంటి విపత్తులు వచ్చిన అందరూ దైర్యంగా నిలబడాలని అందరూ మానవతా దృక్పథంతో సహాయానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ పీవో కృష్ణ మూర్తి, మెప్మా సివో లు,ఆర్పిలు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.