హెచ్ఎం నరేష్ ను కూడా సస్పెండ్ చేయాలి…
1 min readఎంక్వయిరీని తప్పుదోవ పట్టించిన జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయాలి
ఆర్ యు ఎస్ ఎఫ్. పి ఎస్ యు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నందవరం మండలం పూలచింత గ్రామంలో ఎంపీయూపీ విద్యార్థులను కులం పేరుతో దూషించినటువంటి పవన్ కుమార్ మాత్రమే సస్పెండ్ చేసి హెచ్ఎం నరేష్ కు వత్తాసు పలకడం ఏంటని ఈరోజు ఆర్ యు ఎస్ ఎఫ్, పి ఎస్ యూ ఆధ్వర్యంలో నందవరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి ఎస్ యు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కొన్ని వారాల క్రితం కులం పేరుతో దూషించినటువంటి హెచ్ఎం నరేష్ ని పవన్ కుమార్ ని విచారణ జరగగా విచారంలో భాగంగా విద్యార్థులు పూసగుచ్చినట్లు విచారణలో తమ సమస్యను తెలిపినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం టీచర్ పవన్ కుమార్ ని సస్పెండ్ చేసి హెచ్ఎం నరేష్ ఇచ్చినటువంటి ముడుపులను జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయన సస్పెండ్ చేయకపోవడం అంటే సిగ్గుచేటు అని విద్యార్థులకు కుల వివక్షత చూపితే ఉపాధ్యాయులను కాపాడడం ఏంటి అన్ని ఎంక్వయిరీ పేరుతో విద్యార్థులను భయోందానాలను గురి చేయడం ఏంటని ఉపాధ్యాయులను కాపాడుకోడానికా లేదంటే విద్యార్థుల జీవితాలను బానిసత్వంలోకి నెట్టి వేటి కొరకఅన్ని వారు ఆవేదన వ్యక్తం చేశారు విచారణ తప్పుదో పట్టిస్తున్నటువంటి ఎంక్వయిరీ ఆఫీసర్లు ఎంక్వయిరీ కి వేయకుండా న్యాయపరమైనటువంటి ఆఫీసర్లు వేసి తక్షణమే పవన్ కుమార్ టీచర్ ని చేసిన విధంగా హెచ్ఎం నరేష్ కూడా సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారితీస్తామని వారు హెచ్చరించారు.