PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు మెగా ఈవెంట్ ముక్కుపుడక మహారాణి Vs మెగా జగద్ధాత్రి..

1 min read

ఈ శనివారం సాయంత్రం 5:30 గంటలకు.. మన గుంతకల్లో!

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : నిరంతరం వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు బుల్లితెర అభిమానులకు తమకు ఇష్టమైన నటీనటులను నేరుగా కలిసే అవకాశం కల్పిస్తోంది. జీ తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన సీరియల్ తారలను ప్రత్యక్షంగా కలవడమే కాదు, ఇంటికి పిలిచి ఆతిథ్యం అందించే అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఆరంభం నుంచే ఆసక్తికరమైన కథ, ఆకట్టుకునే మలుపులతో కొనసాగుతున్న జీ తెలుగు సీరియల్స్ ముక్కుపుడక, జగద్ధాత్రి, సూర్యకాంతం నటీనటులతోపాటు ఇతర నటీనటులు ఈ నెల 21న(శనివారం) మన గుంతకల్లో నిర్వహించనున్న మెగా ఈవెంట్ ముక్కుపుడక మహారాణి Vs మెగా జగద్ధాత్రి.. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ లాస్య వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, పలువురు జీ తెలుగు నటీనటులు సందడి చేయనున్నారు. గుంతకల్ రైల్వే గ్రౌండ్ వేదికగా శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి ముక్కుపుడక మహారాణి Vs మెగా జగద్ధాత్రి మెగా ఈవెంట్ పేరున ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గుంతకల్ ప్రేక్షకులకు జీ తెలుగు మరో సర్ప్రైజ్ని అందించనుంది. ఇందులో భాగంగా మీ టీవీలో ‘జీ తెలుగు’ ఛానల్ చూస్తూ సెల్ఫీతీసి 7032904615 నెం.కి వాట్సాప్ చేస్తే మీ అభిమాన తారలు నేరుగా మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు తారలు పలు కార్యక్రమాల్లో పాల్గొని అభిమానులతో ముచ్చటిస్తారు. సెల్ఫీ తీసుకుని పంపించిన కొందరు అభిమానుల ఇళ్లను సందర్శించి వారితో కలిసి సాయంత్రం ఐదు గంటలకు వేదిక వద్దకు ఊరేగింపుగా బయలుదేరుతారు. అభిమానుల కోలాహలంతో సందడిగా సాగనున్న ఈ కార్యక్రమంలో ముక్కుపుడక, జగద్ధాత్రి, సూర్యకాంతం సీరియల్స్ నటీనటులు పాల్గొని సందడి చేయనున్నారు. సరిగమప గాయనీగాయకులు గానంతో ప్రేక్షకులను అలరించనుండగా, డ్రామా జూనియర్స్ పిల్లలు తమ నటనతో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. బుల్లితెరపై నటనతో అలరిస్తున్న జీ తెలుగు తారలు తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మన గుంతకల్ వచ్చేస్తున్నారు. మరి మీరూ జీ తెలుగు నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో పాల్గొని మీ అభిమాన తారలను నేరుగా పలకరించే అవకాశం పొందండి.జీ తెలుగు చూస్తూ సెల్ఫీ తీసుకుని పంపించండి.. అభిమాన తారలను మీ ఇంటికి ఆహ్వానించే అవకాశం అందుకోండి!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *