PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంజయ్ గైక్వాడ్ నోటి దురుసు తగ్గించుకోవాలి

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  పి మురళీకృష్ణ

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ నిరసన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బిజెపి నాయకులు నోటి దురుసు తగ్గించుకోవాలని రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా గల మహాత్మ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో డిసిసి నూతన అధ్యక్షులు పి మురళి కృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ, శివసేన (షిండే వర్గం) నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని  పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అవమానకరంగా బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్న మోడీ, అమిత్ షాలు పట్టించుకోక పోవడం వెనుక కుట్ర దాగి వుందన్న అనుమానం కలుగు తోందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీకి దేశంలో ప్రజాదరణ పెరిగిందని ఇది జీర్ణించుకోలేక  ఓర్వలేక ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతుందని ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు? ఏది తీవ్రవాదం? ఈ దేశంలో అట్టడుగు వర్గాల వారు 90 శాతం మంది ఉన్నారని వాళ్లకు అభివృద్ధిలో వాట లేదని రాహుల్ గాంధీ గారు చెప్పడం తీవ్రవాదమా, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని రాహుల్ గాంధీ చెప్పడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఏం కాశీం వలి, జీ రమేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, పీజీ నరసింహులు యాదవ్, దామోదరం రాధాకృష్ణ, ఎన్సీ బజారన్న, రియాజుద్దీన్, ముర్షిద్ పీర్ ఖాద్రి, షేక్ ఖాజా హుస్సేన్, అనంతరత్నం, ఈ లాజరస్, సయ్యద్ నవీద్, మారుతి రావు, సాయినాథ్, శ్రీనీద్ డబ్ల్యూ సత్యరాజు, బి సుబ్రహ్మణ్యం, అబ్దుల్ హై, తిప్పయ్య నాయుడు, రజాక్ వలి, జాన్ సదానందం, సాంబశివుడు, పశుపల ప్రతాపరెడ్డి, ఐఎన్టియుసి ప్రతాప్, తాండ్రపాడు సాయి, కొంతలపాడు ఈదన్న, ఎల్లప్ప, రమేష్, షాహిద్, భాను, వెల్దుర్తి శేషయ్య, దూద్ పీరా, మహిళా కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, కరుణమ్మ, హైమావతి, సాయి భార్గవి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *