ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది – యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని,విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసే శక్తి ఒక్క ఉపాధ్యాయుడుకు మాత్రమే ఉందని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి,జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు.జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీన ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల యందు ప్యాపిలి మండల పరిధిలోని ఏనుగు మర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ సోని గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు వచ్చిన సందర్భంగా యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో ఏనుగు మర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల సీనియర్ నాయకులు బొజ్జన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో వారు మాట్లాడుతూ సోని ఎక్కడ పని చేసినా అక్కడ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మనసు చూరగొన్నారని కొనియాడారు. సోని గారు సైన్స్ ఫేర్ నందు తాను చేసిన ఎన్నో ప్రయోగాలు ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు పొందారని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా వారు మాట్లాడుతూ కర్నూల్ విద్యాశాఖ వారి సహకారంతో 10 వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలో విజయ దీపిక మెటీరియల్ తయారుచేయడంలో, రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విసిఆర్ క్లాసెస్ చెప్పి కలెక్టర్ ద్వారా ప్రశంలు పొందారనీ, ప్లాస్టిక్ ని పెట్రోల్ గా మార్చే పరికరం తయారు చేయడంలో విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అంతే కాదు ఇన్స్పైర్ మనాక్ లో జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు అని యూటీఎఫ్ నాయకులు ఆమె సాధించిన ఘనతలు విద్యార్థిని,విద్యార్థులకు తెలియచేసారు.. అనంతరం సోని ని జ్ఞాపిక,శాలువ,పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కృష్ణా నాయక్, యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్లు సర్వజ్ఞ మూర్తి,అంజనప్ప,సురేష్ బాబు,ప్రసన్న లక్ష్మి,నాగ మద్దయ్య,షేక్షావలి,నరసింహయ్య,లోకేశ్వరి,సాలయ్య,నాగాంజనేయులు,ఉమా దేవి,మారతమ్మ తదితరులు పాల్గొన్నారు.