PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైస్ మిల్లును… ఎంఎల్ఎస్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ

1 min read

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి..జెసి పి.ధాత్రి రెడ్డి

దళారీల మాటలు నమ్మవద్దు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణలో గోనె సంచులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు.  బుధవారం జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో రైతు సేవాకేంద్రాన్ని, జంగారెడ్డిగూడెం లోని విష్ణుప్రియ రైస్ మిల్లు, ఎంఎల్ఎస్ పాయింట్ ను జెసి ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా గోనె సంచులు నిల్వ చేసేందుకు గోడౌన్లను సిద్ధం చేస్తున్నామని అందులో భాగంగా సంబంధిత గోదాముల సన్నద్ధతను పరిశీలిస్తున్నామన్నారు.  ఈ సందర్బంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు.  మధ్య దళారీల మాటలు నమ్మవద్దని సూచించారు.  గోనె సంచులు సక్రమంగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అనంతరం విష్ణుప్రియ రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం సేకరణకు సన్నద్ధతను పరిశీలించారు.  తేమ శాతం ఏవిధంగా కొలిచేది, మిల్లు సామర్ధ్యం , తదితరాలను పరిశీలించారు.  అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ ను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి నిల్వల వివరాలను పరిశీలించారు.  తొలుత కేతవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రానికి కావలసిన పరికరాలన్నీ కూడా  అందుబాటులో ఉన్నవి  లేదా అని పరిశీలించారు. జెసి వెంట జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు,  మండల తాహసిల్దారు కె. స్లీవజోజి,  మండల వ్యవసాయ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు  ఉన్నారు.

About Author