నందికొట్కూరులో 23 నుండి క్రీడా పోటీలు..
1 min readఆటల పోటీలను విజయవంతం చేయండి: ఎంఈఓ సుభాన్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నందికొట్కూరు మండల స్థాయి క్రీడలు మండల స్థాయి క్రీడల విజయవంతానికి కృషి చేయాలని నందికొట్కూరు మండల విద్యాశాఖ అధికారి సుభాన్ గురువారం అన్నారు. రాష్ట్ర మరియు జిల్లా యస్.జి.యఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నందికొట్కూరు మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్ 14/17(బాల&బాలికలు) “మీట్ కమ్ సెలక్షన్స్”ను ఈనెల 23వ తేదీ నుండి నందికొట్కూరు మండలంలోని దామగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు.మండలంలోని అన్ని పాఠశాలల క్రీడాకారులు ఈ మీట్ కమ్ సెలక్షన్స్ లో పాల్గొనాలని వ్యాయామ ఉపాధ్యాయులందరూ సమిష్టి గా కృషిచేసి క్రీడల విజయవంతానికి సహకరించాలని కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నందికొట్కూరు మండల కో-ఆర్డినేటర్ వీరన్న మాట్లాడుతూ కబడ్డీ,ఖో- ఖో,వాలీబాల్,షటిల్ బ్యాడ్మింటన్,యోగా,చెస్, అథ్లెటిక్స్ మొదలగు క్రీడాంశాల్లో ప్రస్తుత ఎస్.జి.ఎఫ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. 23:09:2024 సోమవారం అండర్ 14/17 బాలురకు మాత్రమే నిర్వహిస్తామని అలాగే 24:09:2024 మంగళవారం అండర్ 14/17 బాలికలకు మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. క్రీడల్లో పాల్గొనబోయే జట్లు క్రీడలు జరిగే తేదీలలో ఉ 9 గంటలకు మైదానంలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.మండల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల నిర్వాహక అధ్యక్షురాలు మరియు ప్రధానోపాధ్యాయులు అనిత జీవన్ మాట్లాడుతూ సెలక్షన్స్ లో పాల్గొనబోయే జట్ల వ్యాయామ ఉపాధ్యాయులు. మండల స్థాయి టీం ఎంట్రీ ఫామ్ మండల స్థాయి ప్లేయర్స్ ఎంట్రీ ఫామ్ మిడ్ డే మీల్స్ ఆక్విటెన్స్ ఫామ్ తప్పక మండల కో-ఆర్డినేటర్ ఇవ్వాలన్నారు.మండల ఎస్జిఎఫ్ క్రీడల నిర్వహక కార్యదర్శి సుంకన్న మాట్లాడుతూ క్రీడాకారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజన వసతి కల్పిస్తున్నట్లు భోజనం కొరకు ఎవరి ప్లేట్లు వారే తెచ్చుకోవాలని ఎంఈఓ అన్నారు.