వరదల వల్ల ద్వంసం అయిన రహదారులను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తాం
1 min readవారం రోజుల్లోగా ఏలూరు గుడివాక లంక ప్రధాన
రహదారి పనులు పూర్తి చేస్తాం
రహదారుల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశాలు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు రూరల్ మండలం గుడివాక లంక గ్రామంలో దెబ్బతిన్న ప్రధాన రహదారులను ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఏలూరు రూరల్ లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల దెందులూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాక లంక గ్రామంలో దెబ్బతిన్న ప్రధాన రహదారులను గురువారం సాయంత్రం ప్రభుత్వ అధికారులు, స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. దెబ్బతిన్న రహదారుల నిర్మాణాలు సత్వరమే పూర్తి చెయ్యాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “బుడమేరు, గుండేరు, తమ్మిలేరు, రామీలేరు వరద ప్రభావం వల్ల, భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఉపద్రవంతో దెందులూరు నియోజక వర్గంలోని ఏలూరు కైకలూరు ఆర్ అండ్ బి రహదారి, ఏలూరు గుడివాక లంక ప్రధాన రహదార్లు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని, ఏలూరు గుడివాక లంక ప్రధాన రహదారికి రూ.60లక్షల రూపాయలతో అంచనాలు సిద్దం చేసి శుక్రవారం నుంచే పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సత్వరమే రహదారుల పనులు పూర్తి చేసి లంక గ్రామాల ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, కొల్లేరు నాయకులు సైదు సత్యనారాయణ, అర్ &బి సూపరింటెండెంట్ ఇంజినీర్ జాన్ మోషే, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ బాబ్జీ, ఎమ్మార్వో, ఎంపీడీఓ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.