నందికొట్కూర్ లో వృద్ధులకు వరం..వృద్ధాశ్రమం
1 min readవృద్ధాశ్రమానికి ఫ్యాన్లు అందజేసిన కౌన్సిలర్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. కో ఆర్డినేటర్ లింగం గౌడ్,5వ వార్డ్ కౌన్సిలర్ కృష్ణ వేణమ్మ,వార్డు ఇన్చార్జ్ బ్రహ్మయ్య ఆచారి,పవన్ కుమార్,లోకేష్,షేక్షావలి, రమేష్,సాయి మరియు ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ ల సహకారంతో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆశ్రయాన్ని కలిగించుట కొరకు మదర్ తెరిసా సంస్థను కాలనీలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు.జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస కుమార్, కో ఆర్డినేటర్ లింగం గౌడ్ మాట్లాడుతూ ఈ సంస్థ యొక్క కాలనీలో కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. దాదాపుగా పది మంది వృద్ధులు ఇక్కడ ఆశ్రమంలో ఉండటానికి వచ్చారని అన్నారు.వృద్ధులు అయిన సమయంలో వారిని ఆలనా పాలనా చూడాల్సిన వారు సమాజంలో వారిని పట్టించుకోవడంలేదని కానీ వృద్ధులను చేరదీస్తే అంతకన్నా సంతోషం లేదని వారు అన్నారు.తర్వాత వృద్ధాశ్రమానికి మంచి మనసుతో వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి మరియు వార్డు ఇన్చార్జి బ్రహ్మయ్య అందజేశారు.