పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే. బి వి. జయనాగేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్ కూడళ్లలో 5 రూపాయలకే అన్నం పెట్టె అన్నా క్యాంటీన్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా బి వి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ …… ఎమ్మిగనూరు పట్టణంలోని నిరుపేదల ఆకలి కస్టాలు తీరనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదల ఆకలిని తీర్చడానికి అన్నా క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు. ఇక నుండి ఎమ్మిగనూరు పట్టణంలో యాచకులు, నిరుపేద విద్యార్థులు, రైతులకు కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మద్యానం మరియు రాత్రి కడుపునిండా భోజనం లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పరిసర పల్లెల్లో ఉండే నిరుపేద విద్యార్థులు, కోచింగ్ తీసుకునే నిరుద్యోగులు, వ్యవసాయ పనులు నిమిత్తం పట్టణానికి వచ్చే రైతులు ఇక నుండి వందల రూపాయలు చెల్లించి భోజనం చేసే అవసరం లేదని కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే . డా బి వి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ ను ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించి నిరుపేదలతో కలిసి అల్పాహారం తీసుకొని ఆహార నాణ్యత, రుచిని పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.