ఏపీటిఎఫ్ అత్యవసర నగర శాఖ సమావేశం
1 min readసర్వీస్ రూల్స్ వ్యతిరేకంగా మున్సిపల్ ఉపాధ్యాయులను బదిలీలు చేయడం అన్యాయం
నగర ప్రధాన కార్యదర్శి అబ్బ దాసరి శ్రీనివాసరావు
సాధారణ బదిలీలు, పదోన్నతులు వలనే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు
జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ తొమ్మండ్రు ప్రకాష్
జీవో నెంబర్ 84 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు
నగర అధ్యక్షుడు కురుమ ఆనంద కుమార్ అధ్యక్షుల సమావేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగర శాఖ సమావేశం స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నగరశాఖ అధ్యక్షుడు కురమ ఆనంద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగరశాఖ ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మునిసిపల్ సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా మున్సిపల్ ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు సర్దుబాటు చేయడం వలన ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన G.O.No.84 ను వెంటనే రద్దు చేయాలని ధ్వజమెత్తారు. జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ తొమ్మoడ్రు ప్రకాష్ మాట్లాడుతూ మునిసిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు. ఇవి జరగక పోవడం వలననే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు మాట్లాడుతూ సర్దుబాటులను మండల స్థాయిలో చేయవలసి ఉండగా ప్రభుత్వం ఏకపక్షంగా ఉపాధ్యాయులను డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేయడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే డివిజన్ స్థాయిలో చేసిన సర్దుబాటులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కౌన్సిలర్ వి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు పైబడి మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ కట్ చేయడం లేదని నెంబర్లు కేటాయించవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కౌన్సిలర్లు జె.శాంతి కుమార్, పి.రోజా,కె.పొట్టియ్య, సిహెచ్. వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.